TOP STORIESBreaking Newsజాతీయం

Srishailam : శ్రీశైలంకు భారీ వరద.. 27 గేట్ల ద్వారా జూరాల నుంచి దిగువకు నీటి విడుదల.. లేటెస్ట్ అప్డేట్..!

Srishailam : శ్రీశైలంకు భారీ వరద.. 27 గేట్ల ద్వారా జూరాల నుంచి దిగువకు నీటి విడుదల.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు భారీగా చేరుతుంది. కృష్ణా నది ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 27 గేట్లు ఎత్తి 1,34,310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం 47 TMC ల నీరు నిలువ ఉంది.

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద :

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద నీరు వస్తుంది. జూరాలకు ఇన్ ఫ్లో లక్ష 53 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దాంతో జూరాల ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నీటి సామర్థ్యం 318 మీటర్లకు గాను ప్రస్తుతం 317 మీటర్ల నీటి నిల్వలు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు నుంచి 1,38, 310 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుంది.

ఆల్మట్టికి కొనసాగుతున్న వరద :

కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యామ్ లోకి వరద నీరు కొనసాగుతుంది. వర్షాలకు ఆల్మట్టి పూర్తిస్థాయిలో నిండింది. ఇంకా ఒక లక్ష 24 వేల క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఆల్మట్టి డ్యాం నుంచి 1,50,000 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టులోకి 1,25,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా దిగువకు లక్ష 45 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి తుంగభద్రలోకి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది.

ఇవి కూడా చదవండి : 

Good News : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా చేసుకోండి..!

Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

Srishailam Dam : శ్రీశైలంకు భారీగా పెరిగిన ఇన్ ఫ్లో.. ఒక్క రోజులోనే 4 అడుగడుగులు పెరిగిన జలాశయ నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

Srishailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు, పెరుగుతున్న నీటిమట్టం..!

మరిన్ని వార్తలు