Big Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Big Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
దీంతో పాటు మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, అల్పపీడనం ప్రభావం తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు :
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్.
ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు :
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, హన్మకొండ జిల్లాలు ఉన్నాయి.
MOST READ :
-
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. వారు తక్షణమే స్పందించాలి..!
-
Suryapet : సంచలనం కలిగించిన బంగారం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్..!
-
Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!
-
Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!
-
Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!









