Hello Srinivas : హలో శ్రీనివాస్.. విశిష్టమైన ఐక్యత.. 26న శ్రీనివాస్ పేరు గల వ్యక్తుల ఆత్మీయ సమ్మేళనం..!

Hello Srinivas : హలో శ్రీనివాస్.. విశిష్టమైన ఐక్యత.. 26న శ్రీనివాస్ పేరు గల వ్యక్తుల ఆత్మీయ సమ్మేళనం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
కరీంనగర్ నగరంలో ఈనెల 26 (ఆదివారం) రోజున “శ్రీనివాసు” ఒకే పేరు గల వ్యక్తుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఊట్కూరి ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ మల్కాపూర్ రోడ్డు పివిఆర్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నారని తెలంగాణ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ, డైమండ్ నేత్ర నిధి వ్యవస్థాపకులు లయన్ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్), సీనియర్ జర్నలిస్ట్ రంగా శ్రీనివాస్ లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నివసించే శ్రీనివాస్ అనే ఒకే పేరు గల వ్యక్తుల మహాకలయిక ను భారీ స్థాయిలో ప్రపంచ రికార్డును సృష్టించాలనే సంకల్పంతో శ్రీనివాస్ పేరు గల వారందరూ ఐక్యతతో తమవంతుగా కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి గ్రూప్ హలో శ్రీనివాస్ అనేది విశిష్టమైన ఐక్యతకు ప్రతీక అని వేలాది మంది శ్రీనివాస్ లతో జరగనున్న సమావేశం ద్వారా మన సామాజిక, సంస్కృతిక ఐక్యతకు గ్లోబల్ గుర్తింపు దక్కించుకుంటామని వారు పేర్కొన్నారు.
హలో శ్రీనివాస్ చలో కరీంనగర్ పేరిట భారీ మహాసభ జరగనుందని, శ్రీనివాస నామ మహిమను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం వేలాది మందితో జరగనుందని వారు అన్నారు. శ్రీనివాసుల ఏకతా సామాజిక సేవా ప్రతిజ్ఞ రక్తదాన శిబిరాలు సంస్కృతి కార్యక్రమాలు శ్రీనివాస నామధేయం అనే భావనను ప్రతిబింబించే వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారని వారు తెలిపారు.
శ్రీనివాసులు కలిసినప్పుడు ఆధ్యాత్మిక శక్తి సామాజిక సేవ ఉత్సాహం మన తెలుగు సంస్కృతికి గౌరవం ఒకే వేదికపై ప్రతిపలిస్తుందని, శ్రీనివాస్ సుల కలయిక మన అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈనెల 26న కరీంనగర్ లో జరిగే కార్యక్రమానికి ప్రతి శ్రీనివాస్ పేరు గల వ్యక్తి తప్పనిసరిగా హాజరై ఈ చారిత్రక రికార్డు సృష్టిలో భాగస్వామి కావాలని వారు కోరారు.
MOST READ :
-
State Level Badminton : రాష్ట్రస్థాయి బాడ్మింటన్ పోటీలకు శరణ్య ఎంపిక..!
-
Nalgonda : పిన్ని కూతురిని గర్భవతిని చేసిన అన్న.. 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష..!
-
Miryalaguda : అకాల వర్షం.. నేలపాలైన వరి, అన్నదాతలకు తీవ్ర నష్టం..!
-
Bus Accident : కర్నూలు బస్సు దగ్ధం ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పిందంటే.. (వీడియో)
-
Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!









