TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!

Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

నకిలీ విత్తనాలు ప్రతి ఏటా రైతులను నట్టేట ముంచుతున్నాయి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు జాగ్రత్తలు సూచనలు పాటించకపోవడం వల్ల భారీ నష్టం మూటగట్టుకుంటున్నారు.

కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లక ఆర్థికంగా నష్టపోతున్నారు. పంటల సీజన్ వచ్చేసింది. ఈ సమయంలో విత్తనాలను కొనుగోలు చేయడానికి సూచనలు పాటించాలి. నకిలీ విత్తనాలు ఎలా ఉంటాయో.. మంచి విత్తనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

విత్తన ప్యాకెట్ సరిగ్గా సీల్ ఉందో..? లేదో..? చూసుకోవాలి. ట్యాంపర్ చేసినట్లుగా కనపడితే కొనవద్దు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.

విత్తనాల ప్రతి ప్యాకెట్ పై ప్రభుత్వం ధ్రువీకరించిన ట్యాగ్ ఉందో లేదో తనిఖీ చేయాలి. ఈ ట్యాగ్ నీలం లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. నాణ్యత సూచిస్తుంది. విత్తనం రకం, లాట్ నెంబర్, గడువు తేదీ ఇతర ముఖ్యమైన వివరాలు స్పష్టంగా ముద్రించబడి ఉండాలి. అదే నాణ్యమైన విత్తనంగా పరిగణించవచ్చును.

కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. బిల్లుపై పూర్తి వివరాలు ఉండే విధంగా, డీలర్స్ సంతకం కూడా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. విత్తనాలు కూడా ఒకే పరిమాణంలో ఉండాలి. వాటి రంగు, వాసనలలో ఏదైనా తేడా ఉంటే వాటిని కొనవద్దు.

నకిలీ విత్తనాలతో రైతులు భారీగా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా సూచనలు పాటించాలి. అంతే కాకుండా ఏమైనా అనుమానం ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులకు కూడా సంప్రదించాలి.

MOST READ : 

  1. తాటి ముంజల పోషక రహస్యం.. శారీరక శక్తికి, లైంగిక ఆరోగ్యానికి మంచిదేనా..!

  2. గంజి నీళ్లే అని పారబోస్తున్నారా.. ఏం చేయాలో తేలుసుకుందాం..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!

  4. Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!

  5. WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

మరిన్ని వార్తలు