Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Musi : మూసి ప్రాజెక్టుకు భారీ వరద.. కుడి కాలువకు నీటి విడుదల..!

Musi : మూసి ప్రాజెక్టుకు భారీ వరద.. కుడి కాలువకు నీటి విడుదల..!

కేతేపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసి ప్రాజెక్టు కుడి కాలువ కు జూలై 18 శుక్రవారం ( నేడు) ఉదయం 10 గంటలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నీటిని విడుదల చేయనున్నారని మూసి ప్రాజెక్టు డి ఈ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూసి ప్రాజెక్టు కుడి, ఎడమల కాలువలకు నీటి విడుదల కు షెడ్యూల్ ఖరారు అయిందని తెలిపారు.

మూసి కుడి, ఎడమ కాలువలకు నాలుగు విడతలుగా ఆరుతడి నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు. మొదటి విడతగా జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు 25 రోజులు, రెండో విడతగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు 15 రోజులు, మూడో విడతగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు 15 రోజులు, చివరగా అక్టోబర్ 26 నుంచి 15 రోజులు, ఇంకా నీరు నిల్వ ఉన్నచో నీటి విడుదల కొనసాగునని ఆయన తెలియజేశారు. ఆయకట్టు రైతులు నీటిని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వాడుకోవాలని ఆయన రైతులకు సూచించారు.

MOST READ : 

  1. District collector : అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థినులు.. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్..!

  2. CM Revanth Reddy : సెమీ కండ‌క్ట‌ర్ ప్రాజెక్టుల‌కు ఆమోదం తెల‌పండి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

  3. District Collector : విద్యార్థుల ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..!

  4. Nails Color: గోళ్ల రంగులతో మీ ఆరోగ్య సమస్య చెప్పేయొచ్చు.. ఎలాగంటారా..!

మరిన్ని వార్తలు