Musi : మూసీ నదికి భారీ వరద.. రిజర్వాయర్ గేట్లు ఎత్తిన అధికారులు..!

Musi : మూసీ నదికి భారీ వరద.. రిజర్వాయర్ గేట్లు ఎత్తిన అధికారులు..!
కేతేపల్లి, మనసాక్షి
హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగుతోంది. భారీగా వరద నీరు వచ్చి మూసి రిజర్వాయర్ లో చేరుతుంది. మూసి ప్రాజెక్టు రిజర్వాయర్ లోనికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను శుక్రవారం ఎత్తి మూసి ఏటిలోనికి నీటిని అధికారులు విడుదల చేశారు. రిజర్వాయర్ ఎగువ నుంచి ఇన్ఫ్లో పెరగడంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఉన్నతాధికారుల ఆదేశానుసారం నీటిపారుదల శాఖ ఈ ఈ వెంకటరమణ 3 8 నెంబర్ల క్రస్ట్ గేట్లను ఒక అడుగు ఎత్తు మేర లేపి 1300 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. మూసి ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 4.46 టిఎంసిలు గాక కాగా శుక్రవారం సాయంత్రం వరకు రిజర్వాయర్లో 4.09 టిఎంసిల నీరు నిలువ ఉంది.
ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా 382 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందని ప్రాజెక్టు ఏఈ డి ఉదయ్ కుమార్ తెలిపారు. గేట్లు కాలువలు ఆవిరి ద్వారా మొత్తం 1730 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతుందని ఆయన వివరించారు.. మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
MOST READ :
-
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!
-
District Collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!









