తెలంగాణBreaking Newsవ్యవసాయం

TG News : అసెంబ్లీ వేదికగా రైతులకు భారీ గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఖాతాలలో డబ్బులు..!

TG News : అసెంబ్లీ వేదికగా రైతులకు భారీ గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఖాతాలలో డబ్బులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ అసెంబ్లీ వేదికగా రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. రైతు భరోసా పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతికి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శనివారం అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి రైతు భరోసా కీలక ప్రకటన చేశారు.

రైతు భరోసాపై సబ్ కమిటి ఏర్పాటు చేశామని, రైతుల అభిప్రాయ సేకరణ మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు 80 వేల కోట్లు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతంలో రైతుబంధు ద్వారా సాగు చేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చినట్లు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అయితే భూభారతి బిల్లును, రైతు భరోసా పై మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది.

రైతుబంధును బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిందని, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుబంధు ఒక పంటకే ఇస్తారా..
లేక రెండు పంటలకు ఇస్తారా..? ప్రభుత్వం చెప్పాలని, కెటీఆర్ డిమాండ్ చేశారు. ఏది ఏమైనా రైతు భరోసా పథకంతో సంక్రాంతి పండుగకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు