TOP STORIESBreaking Newsవ్యవసాయం

Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!

Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి, కిసాన్ సమృద్ధి కేంద్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనే సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు రైతుల కోసం ప్రవేశపెట్టబడినవి. లక్షలాది మంది రైతులు ఈ పథకాల ద్వారా జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారు.

కాగా ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అనే పథకం కింద 60 సంవత్సరాలు దాటిన రైతులకు నెలకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. దీని ద్వారా వృద్ధాప్యంలో ఉన్న రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుంది. కిసాన్ మాన్ ధన్ యోజన పథకం 2019 న సెప్టెంబర్ 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారికి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పిస్తుంది.

18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్న సన్న కారు రైతులు పెన్షన్ పొందేందుకు అర్హులు. రైతు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ రైతు జీవిత భాగస్వామికి మాత్రమే లభిస్తుంది. ఈ పథకంలో భర్త చేరితే పెన్షన్ భార్యకు, భార్య నమోదు చేసుకుంటే పెన్షన్ మొత్తం భర్తకు వెళుతుంది.

ఈ పథకంలో పాల్గొనడానికి రైతులు నెలకు 100 రూపాయల చొప్పున (సగటున 29 సంవత్సరాల వయసులో) డిపాజిట్ చేయాలి. ప్రభుత్వం అంతే మొత్తాన్ని అందిస్తుంది. ఈ డబ్బు పెన్షన్ చెల్లించే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) యొక్క పెన్షన్ ఫండ్ లో జమ చేస్తారు.

నమోదు చేసుకోవడానికి రైతులు తమ సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్స్ ను సందర్శించాలి. వారి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకెళ్లాలి. ఆ తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో జరుగుతుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ నమోదు చేయాలి. రైతు వయసు ఆధారంగా నెలవారి సహకారాన్ని ఈ వ్యవస్థ నిర్ణయిస్తుంది.

రైతులు ప్రారంభం మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు. ఆ తర్వాత ఒక ఫారం నింపాల్సి ఉంటుంది. దానిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత రైతుకు ప్రత్యేకమైన కిసాన్ పెన్షన్ ఖాతా నెంబర్ కార్డు లభిస్తుంది. ఈ ప్రక్రియ అంతా రైతులకు కొంచెం క్లిష్టమైనప్పటికీ ఈ పథకం లో సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకంలో చేరిన రైతులకు 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు 3000 రూపాయల పెన్షన్ అందుతుంది.

MOST READ : 

  1. LPG GAS : ఈకేవైసీ చేయకుంటే గ్యాస్ సబ్సిడీలు వర్తించవు.. ఇలా చేసుకోవాలి..!

  2. Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!

  3. JNTU : జేఎన్‌టీయు విద్యార్ధి ఆత్మహత్య.. బయటపడని ఆత్మహత్యకు కారణాలు..!

  4. Good News : ఏకలవ్య మోడల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..!

మరిన్ని వార్తలు