TOP STORIESBreaking Newsజాతీయం

Srishailam Dam : శ్రీశైలంకు భారీగా పెరిగిన ఇన్ ఫ్లో.. ఒక్క రోజులోనే 4 అడుగడుగులు పెరిగిన జలాశయ నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

Srishailam Dam : శ్రీశైలంకు భారీగా పెరిగిన ఇన్ ఫ్లో.. ఒక్క రోజులోనే 4 అడుగడుగులు పెరిగిన జలాశయ నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కృష్ణ పరివాహక ప్రాంతంలో జోరుగా వర్షాలు కురుస్తున్నందున వరద ప్రవాహం పెరిగింది. కృష్ణానది పై ఉన్న ప్రాజెక్టులన్ని నిండుకుండలా జలకళలాడుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండడంతో ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువ కొన్నిటిని విడుదల చేస్తున్నారు. దాంతో కృష్ణ వరద శ్రీశైలం కు చేరుతుంది. వర్షాలు ఉదృతంగా పడటంతో శ్రీశైలంకు భారీగా వరద నీరు చేరుతుంది.

814 అడుగులకు చేరిన శ్రీశైలం లెవెల్ :

శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. శ్రీశైలం జలాశయ నీటి నిల్వల సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 814 అడుగులకు చేరింది. ఒక్క రోజులోనే శ్రీశైలం జలాశయం నీటిమట్టం నాలుగు అడుగుల మేర పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి ఒక లక్ష క్యూసెక్కుల నీరు చేరుతుంది. దాంతో శ్రీశైలం జలాశ నీటిమట్టం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37 TMC ల నీరు నిల్వ ఉంది. మరింతగా ఇన్ ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉంది.

జూరాల నుంచి 17 గేట్ల ద్వారా నీటి విడుదల :

ఆల్మట్టి , నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ఉండటంతో జూరాలకు భారీగా వరద నీరు చేరుతుంది. దాంతో జూరాల ప్రాజెక్టుకు 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 90 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో 17 గేట్లు ఎత్తి ఒక లక్ష 94 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం కు మరింతగా ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : 

Srishailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు, పెరుగుతున్న నీటిమట్టం..!

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు.. తుంగభద్రకు భారీగా వరద, విద్యుత్ ఉత్పత్తితో సాగర్ కు నీటి విడుదల..!

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

మరిన్ని వార్తలు