జాతీయంBreaking News
LPG : భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!
LPG : భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19 కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 41 తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. దాంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధర 1762 రూపాయలుగా ఉంది. తగ్గిన ధరలు ఏప్రిల్ 1, (మంగళవారం) నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ ధర లో ఎలాంటి మార్పు లేదు. కేవలం వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రమే జనవరి, ఫిబ్రవరి మాసంలో స్వల్పంగా తగ్గగా ఇప్పుడు భారీగా తగ్గాయి.









