Hyderabad : హైదరాబాదులో దారుణం.. రెండు నెలల శిశువు కాళ్లు, చేతులు కట్టేసి పొయ్యిలో పడేసి హత్య చేసిన కన్నతల్లి..!
హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు నెలల శిశువును కాళ్లు, చేతులు కట్టేసి కట్టెల పొయ్యిలో పడేసి కన్నతల్లి హత్య చేసింది. పోస్ట్ పార్టం సైకోసిస్ కు గురైన ఆ కన్నతల్లి కర్కషంగా చంపేసినట్లు సమాచారం. హైదరాబాదులోని బౌరంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Hyderabad : హైదరాబాదులో దారుణం.. రెండు నెలల శిశువు కాళ్లు, చేతులు కట్టేసి పొయ్యిలో పడేసి హత్య చేసిన కన్నతల్లి..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు నెలల శిశువును కాళ్లు, చేతులు కట్టేసి కట్టెల పొయ్యిలో పడేసి కన్నతల్లి హత్య చేసింది. పోస్ట్ పార్టం సైకోసిస్ కు గురైన ఆ కన్నతల్లి కర్కషంగా చంపేసినట్లు సమాచారం. హైదరాబాదులోని బౌరంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ కు చెందిన మమత (22) ఆదివాసి రాజేంద్రను ప్రేమ వివాహం చేసుకుంది. బౌరంపేటలో బిల్డింగ్ నిర్మాణంలో కూలీలుగా వీరు పనిచేస్తున్నారు. మమత రెండు నెలల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. శిశువు నిత్యం ఏడుస్తుండడంతో సమయానికి నిద్ర, ఆహారం తీసుకోక పోస్టుమార్టం సైకోసిస్ కు మమత గురైంది. దాంతో క్షణికావేశంలో చిన్నారి కాళ్లు, చేతులు తాడుతో కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి మండుతున్న కట్టెలపొయ్యిలో పడేసింది.
కూలీ పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంట్లోకి వచ్చిన తండ్రి రాజేంద్ర చిన్నారిని బయటకు తీశాడు. అప్పటికే సగం శరీరం కాలిపోయి చిన్నారి మృతి చెందింది. ఈ విషయంపై మమతను నిలదీయగా భర్త పై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో రాజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా మమతను అరెస్టు చేశారు. పోస్ట్ పార్టం సైకోసిస్ వల్ల జైలులో కూడా పోలీసులపై అరుస్తూ మమత ఊగిపోతున్నట్లు సమాచారం.