Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్
Hyderabad : సెకండ్లలో కారు నెంబర్ ప్లేట్ చేంజ్.. సరికొత్త మోసం..!
హైదరాబాద్ పోలీసులు కంగుతిన్నారు. సెకండ్లలో కారు నెంబర్ ప్లేట్ చేంజ్ చేయడానికి చూసి అధికారులు సైతం విస్తు పోయారు. ఈ సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో జరిగింది.

Hyderabad : సెకండ్లలో కారు నెంబర్ ప్లేట్ చేంజ్.. సరికొత్త మోసం..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాద్ పోలీసులు కంగుతిన్నారు. సెకండ్లలో కారు నెంబర్ ప్లేట్ చేంజ్ చేయడానికి చూసి అధికారులు సైతం విస్తు పోయారు. ఈ సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో జరిగింది. జూబ్లీహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. కాగా అతని కారులో నెంబర్ ప్లేట్లు సెకండ్లలో మార్చే ప్రత్యేక టెక్నాలజీని పోలీసులు కనుగొన్నారు. కేవలం బటన్ నొక్కితే చాలు నెంబర్ ప్లేట్ చేంజ్ అవుతుంది. బటన్ నొక్కడం ద్వారా చలాన్లు పడకుండా వేరే నెంబర్ ప్లేట్ వచ్చేలా దీనిని సెట్ చేశాడు. దాంతో అధికారులు విస్తు పోయారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.









