హైదరాబాద్ దూల్పేట్ టు మునుగోడు..!
హైదరాబాద్ దూల్పేట్ టు మునుగోడు..!
నల్లగొండ, మనసాక్షి :
మునుగోడు ప్రాంతంలో అక్రమంగా గంజాయిని అమ్ముతున్న నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీశరత్చంద్ర పవర్ తెలిపారు. శనివారం మునుగోడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. హైదరాబాద్ దూల్పేట్ కి చెందిన గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయిని కొనుగోలు చేసి మునుగోడు చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి అమ్ముతున్న
మునుగోడు మండలం కొరటికల్లుకు చెందిన బొల్లం వెంకటేష్, కనగల్లు మండలం కురంపల్లికి చెందిన దోటి రామరాజు, మునుగోడు కమ్మగూడెంకు గ్రామానికి చెందిన ఆర్మెల్లి వికాస్ వర్ధన్, కొంపెల్లి గ్రామానికి చెందిన వీరమల్ల లింగస్వామి, గుర్రంపోడు మండలం బొల్లారం పురం గణేష్ లు తేదీ 20 రోజు లక్ష్మి దేవిగూడెం రోడ్ ప్రక్కన గల పశువుల సంతలోని షెడ్ వద్ద గంజాయి అమ్ముచున్నారన్న
అని నమ్మదగిన సమాచారం మేరకు, మునుగోడు యస్.ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బంది తో ఉదయం లక్ష్మీదేవి గూడెం వద్ద (5) మంది వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ లతో పశువుల సంత లోని షెడ్ అనుమానాస్పద స్థితిలో ఉండగా,యస్. ఐ తన సిబ్బందితో యుక్తంగా పట్టుబడి చేసి, విచారణ చేయగా వారు హైదరాబాద్ లోని ధూల్ పేట్ చెందిన గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర (5) ప్యాకెట్లు లలో 200 గ్రాములు రూ. 2,000/- ల చొపున మొత్తం రూ.10,000/- గంజాయిని కొనుగోలు చేసి, మోటార్ సైకిల్ పై లక్ష్మి దేవిగూడెం రోడ్ ప్రక్కన గల పశువుల సంత లోని షెడ్ వద్దకు తీసుకవచ్చి, వారి స్నేహితులకు తెలియపరిచగా, వారు అక్కడికి రాగా, వారు అట్టి గంజాయిని 200 గ్రాములు, చొప్పున తీసుకొని, గంజాయి త్రాగే వ్యక్తులకు అమ్ముదామని తీసుకపోవడానికి సిద్దంగా ఉండగా, పోలీస్ లు పట్టు బడి చేసి, వారి వద్ద నుండి అందాజ 1000 గ్రాములు గంజాయిని, (4) సెల్ ఫోన్ లు, గంజాయి రవాణా చేయుటకు ఉపయోగించిన వాహనాలను మరియు 4 సెల్ ఫోన్ లను స్వాదిన పరుచుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఇట్టి వ్యక్తులు తక్కువ ధరకు గంజాయిని దూల్పెట్, హైదరాబాద్ నందు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి, మునుగోడు చుట్టు ప్రక్కల వారకి ఎక్కువ ధరకు అమ్ముతున్నారనీ ఇందులో బాగముగా 35 మంది భాదితులను గుర్తించి, వారిలో కొంత మందికి పరీక్షలు చేయగా గంజాయి సేవించినట్లుగా వచ్చినది. మరియు అందరికి కౌన్సిలింగ్ చేసినట్లు తెలిపారు. ఇట్టి గంజాయిని కేసును ఛేదించిన నల్లగొండ డియస్పి కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూర్ సి.ఐ ఎ. వెంకటయ్య ఆధ్వర్యంలో మునుగోడు యస్.ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు, సిబ్బంది రమేశ్, నర్సింహా, వెంకన్న, నాగేశ్వర రావు, ఆంజనేయులు, జానీ, మోహన్ లను జిల్లా యస్.పి అభినందించారు.
ALSO READ :
బిగ్ బ్రేకింగ్ : TSPSC గ్రూప్ 2 పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
BREAKING : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్.. షెడ్యూల్ ఖరారు..!









