Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

హైదరాబాద్, నాగార్జునసాగర్ రహదారిపై ప్రమాదం..!

హైదరాబాద్, నాగార్జునసాగర్ రహదారిపై ప్రమాదం..!

చింతపల్లి, మన సాక్షి :

చింతపల్లి మండల పరిధిలోని హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం

మండల పరిధిలోని వింజమూర్ ఎక్స్ రోడ్ వద్ద ధైర్యపురి తండాకు చెందిన రామావత్ కేశవులు (59 ) ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వింజమూరు వింజమూర్ ఎక్స్ రోడ్ పై ఉన్న ఓ కిరాణా షాపులో ఇంటిలోకి అవసరమైన కిరాణం సామాన్లు తీసుకొని రోడ్డు దాటుతుండగా అదే సమయంలో మల్లెపల్లి నుండి హైదరాబాద్ వెళుతున్న బ్రీజా కార్ టీఎస్ 27 88 72 నెంబర్ గల వాహనం రోడ్డు దాటుతున్న కేశవులును ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే కేశవులు మృతి చెందాడు.

అతని భార్య రామావత్ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు