District collector : నేను గంజాయి వాడను.. జిల్లా కలెక్టర్ వినూతన ప్రచారం..!
District collector : నేను గంజాయి వాడను.. జిల్లా కలెక్టర్ వినూతన ప్రచారం..!
నల్గొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఆ జిల్లా కలెక్టర్ వినూతన ప్రచారానికి తెర తీశారు. ఈనెల (ఆగస్టు) 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు విస్తృత ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
నల్గొండ జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగం గంజాయి లేని నల్గొండగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు, తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలీసు అధికారులకు సహకరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
నేను గంజాయి వాడను.. గంజాయి లేని నల్గొండ నా లక్ష్యం అంటూ వాట్సప్ డీడీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా లలో ప్రతి ఒక్కరు ఫోటోతో ప్రచారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వేలాది, లక్షలాది రూపాయలు తల్లిదండ్రులు ఖర్చు చేసి తమ పిల్లలను చదివించుకుంటుంటే గంజాయి బారిన పడి ఎంతోమంది జీవితాలు ఆగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. విస్తృత ప్రచారంలో యువతకు, తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు
అదే విధంగా గంజాయి వాడే వారి వివరాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 871267 0266 నెంబర్ కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. గంజాయి మత్తు వల్ల యువత జీవితాలు ఆగమైతున్నాయని ప్రజలకు వివరించే దిశగా అవగాహన కార్యక్రమాలు సైతం ఈ వారం రోజులపాటు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
BREAKING : నల్లగొండలో రూ.1.41 కోట్ల విలువైన గంజాయి దగ్దం..!
ACB : ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!
మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!









