Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్రాజకీయం

ప్రత్యేక నిధులతో మరింత అభివృద్ధి చేస్తా.. మంత్రి సీతక్క..!

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, పట్టణానికి జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేక నిధులు తేవడం ద్వారా మరింత అభివృద్ధి చేస్తానని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. బుధవారం భీమ్‌గల్‌ పట్టణం లో రూ. 55 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రత్యేక నిధులతో మరింత అభివృద్ధి చేస్తా.. మంత్రి సీతక్క..!

భీంగల్, మన సాక్షి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, పట్టణానికి జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేక నిధులు తేవడం ద్వారా మరింత అభివృద్ధి చేస్తానని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. బుధవారం భీమ్‌గల్‌ పట్టణం లో రూ. 55 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆమె మాట్లాడారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆడ కూతురు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించి రాష్ట్రంలో అన్ని వర్గాల మహిళలకు ఉపాధి కల్పించి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ధ్యేయంగా మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు.

ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు 30 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. మున్సిపల్ కేంద్రాలలో ఉన్న మహిళా సంఘాలకు కూడా ఉపాధి కల్పనకు కృషి చేస్తూ స్వయం ఉపాధిని అందిస్తున్నామన్నారు.

60 సంవత్సరాలు నిండిన మహిళ సంఘాలలో అర్హులు కాదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని కాని కాంగ్రెస్ ప్రభుత్వం వయసుకు సంబంధం లేకుండా మహిళా సంఘాలలో సభ్యత్వం కల్పించి బ్యాంకుల ద్వారా బీమా సదుపాయాన్ని కూడా అందిస్తుందని అన్నారు.

10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ రాయితీని ఇవ్వలేదని విమర్శించారు.పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పలాలపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసిన అభివృద్ధి ఆగదని కనుక భీమ్‌గల్‌ ప్రజలు కూడా మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 ఓడిన ప్రజల కోసం : 

గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందిన ముత్యాల సునిల్ కుమార్ ప్రజాసేవ కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేస్తూ ప్రజారక్షకుడిగా ఉన్న సునిల్ కుమార్ ను అభినందించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రోత్సహించిన గంజాయిని రూపుమాపి యువతను సన్మార్గంలో పెట్టామని సునిల్ కుమార్ అన్నారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, నాయకులు కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, పర్శ అనంత్ రావు, వాక మహేష్, నాగేంద్రబాబు, సుంకరి సురేష్, సతీష్, సమీర్, జుబేర్, హసీబ్, జీషన్, ఆమెర్, దానిష్, దుమల రాజు, అరిగేల జనార్దన్, మహేష్, సాయిబాబా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం.. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..!

  2. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  4. Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

మరిన్ని వార్తలు