క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : మల్టీ డ్రగ్ వన్ స్టెప్ టెస్ట్ డివైస్ తో గంజాయి సేవించిన వారి గుర్తింపు..!

మిర్యాలగూడ : మల్టీ డ్రగ్ వన్ స్టెప్ టెస్ట్ డివైస్ తో గంజాయి సేవించిన వారి గుర్తింపు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

గంజాయి సేవించిన వారికి జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్ ప్రభావాన్ని తెలుసుకోవడానికి గాను సోమవారం మిర్యాలగూడ పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగా ఇద్దరు కౌన్సిలింగ్ తీసుకున్న వారిని మరియు ఇద్దరు అనుమానితులను మల్టీ డ్రగ్ వన్ స్టెప్ టెస్ట్ డివైస్ ద్వారా తనిఖీ చేశారు.

కాగా ఇద్దరు కౌన్సిలింగ్ తీసుకున్నవారికి “నెగెటివ్” రిపోర్ట్ రాగా మరో ఇద్దరు కౌన్సిలింగ్ తీసుకోని అనుమానితులకు “పాజిటివ్ రిపోర్ట్ వచ్చినదని మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.

వారు ఈమద్య కాలంలో గంజాయి సేవించినట్లు రుజువు అయినదని జిల్లా ఎస్.పి ఆదేశాల మేరకు కొన్సిలింగ్ తీసుకున్న వారిపై నిఘా కొనసాగిస్తూ వారు చెడుమార్గంలో మళ్ళకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.

వకరు కొత్తగా మాధక ద్రవ్యాలు సేవించినట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన హౌసింగ్ బోర్డు మరియు చర్చ్ రోడ్డు కు చెందిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోబడుతుందని డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు

పోలీసు శాఖ వారివద్ద విరివిగా అందుబాటులో ఉన్న” మల్టీ డ్రగ్ వన్ స్టెప్ టెస్ట్ డివైస్” ద్వారా అనుమానితులపై అకస్మాత్ పరీక్షలు నిర్వహించి మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా రిపోర్ట్ వచ్చిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడును అని ఆయన తెలిపారు.

జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గంజాయి సరఫరా మరియు గంజాయి సేవిస్తున్నవారిపై మిర్యాలగూడ పట్టణ పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి గంజాయి నిర్మూలనలో భాగంగా ఇప్పటివరకు మిర్యాలగూడ పరిధిలో (35) మంది గంజాయి సరఫరా దారులను పట్టుబడి చేసి వారినుండి (153) కేజీల గంజాయిని స్వాధీనపర్చుకొనైనది మరియు (5) కేసులు నమోదు చేసి నిందితులను రిమాండుకు పంపించడం జరిగినదని తెలిపారు.

మరోవైపు గంజాయి సరఫరా దారులు మరియు గంజాయి సేవిస్తున్న వారిలో మార్పు కొరకు జిల్లా యస్. పి” మిషన్ పరివర్తన్” పేరుతో కౌన్సిలింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినారు. అందులో భాగంగా జూలై 30న (25) మందిని వారి సంరక్షకులతో యుక్తంగా నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ కు పంపించి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగిందని తెలిపారు.

ALSO READ : 

Miryalaguda : తెలంగాణలోనే మిర్యాలగూడను మొదటి స్థానంలో ఉంచాలి..!

తెలంగాణలో ఉప ఎన్నికలు.. వైరల్ అవుతున్న న్యూస్..!

Nagarjunasagar : తెరుచుకున్న సాగర్ గేట్లు.. నిండుగా కాలువలు.. పంట పొలాల్లో రైతుల సందడి..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ 6 గేట్లు ఎత్తి నీటి విడుదల.. కృష్ణమ్మ పరవళ్ళు.. Latest Update

మరిన్ని వార్తలు