Miryalaguda : ధాన్యం మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కఠిన చర్యలు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!
Miryalaguda : ధాన్యం మద్దతు ధర కంటే తక్కువకు కొంటే కఠిన చర్యలు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన రైస్ మిల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి హెచ్చరించారు. శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి రైస్ మిల్లర్స్ తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ధాన్యం రకాన్ని , తేమ శాతాన్ని బట్టి మద్దతు ధర కంటే తగ్గకుండా ధరలను నిర్ణయించాలని మిల్లర్స్ కి సూచించారు. అలాగే రైతులు కూడా ధాన్యం తేమ విషయంలో గానీ ధర విషయంలో గాని ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీకు అందుబాటులో అగ్రికల్చర్ అధికారులు, మేము ఉంటామన్నారు మాకు తెలియజేయండి మేము మీ తరుపున మిల్లుకు వచ్చి చెక్ చేస్తామని అన్నారు.
రైతులు కూడా ఎవ్వరూ తొందర పడకండి ధాన్యం మిల్లర్స్ కొనుగోలు చేయకపోతే ఐకేపీ సెంటర్స్ కు తీసుకెళ్ళండి. అక్కడ అన్ని రకాల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో మధ్యవర్తులను నమ్మి రైతులు మోసపోవద్దని నేరుగా మిల్లర్లతో గాని, ఐకెపి సెంటర్లో గానీ విక్రయించుకోవాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరు ఎలాంటి అసత్య ప్రచారాలు చేసి రైతులను బయందోనలకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి, బండారు కుశలయ్య, తహసిల్దార్ హరిబాబు, వ్యవసాయ అధికారులు అగ్రికల్చర్ అధికారులు , పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : ప్రభుత్వం ఓటీపీలు అడగదు.. లింకులు పంపదు, వివరాలకు కోడ్, జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
RRC : రాత పరీక్ష లేకుండా టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. 5647 ఖాళీల భర్తీ..!
-
Gold Price : బంగారం ప్రియులకు గోల్డెన్ డేస్.. తులం బంగారం ఎంతంటే..!
-
Family Survey : ఎక్కడుంటే అక్కడే సర్వే.. ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి..!









