జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండవ్యవసాయంసూర్యాపేట జిల్లా

రైతులకు రుణమాఫీ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!

రైతులకు రుణమాఫీ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!

సూర్యాపేట, మనసాక్షి :

జిల్లాలో రెండో విడత 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. మంగళవారం రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరం నుండి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ, ఆర్డిఓ వేణుమాధవ్ రావు, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎల్ డి ఎం బాపూజీ, డిసిఒ పద్మజ, వివిధ బ్యాంకు మేనేజర్లు సహకార సంఘాలు రైతులతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలు 56,217 రైతు కుటుంబాలకు 282.7 8 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీలో 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని ఆమె పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు రైతు రుణమాఫీ లో భాగస్వాములై విజయవంతం చేశారని, ఇంకొద్ది క్షణాల్లో రైతుల ఖాతాలలో రుణమాఫీ జమ అవుతాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

మొదటి, రెండో విడతలో ఏదైనా సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ జరగని రైతులు మండల, డివిజన్ వ్యవసాయ అధికారులు సంప్రదించాలని ఆమె సూచించారు. కొంతమంది రైతుల యొక్క ఆధార్ కార్డు నెంబరు ఆనుసందానమైన ఫోన్ నెంబరు తప్పుగా ఉండటం వల్ల రుణ మాఫీ నిధులు జమ కావడం లేదని, అట్టివారు ఎఈఓ ని కలిసినట్లైతే వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులను తప్పకుండా వారి సమస్యను వెంటనే పరిష్కరించి పంపాలని, ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీ అందరికీ అందేలా చూడాలని, రైతు అంటే మన ఇంట్లో మనిషిగా భావించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలన్నారు.

డివిజన్ స్థాయిలో గాని మండలాల్లో గాని ఎలాంటి పొరపాట్లు జరిగిన వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని రావాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రైతువేదికలలో రైతు రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేశారని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా రైతు రుణమాఫీ చెక్కును రైతుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ALSO READ : 

NALGONDA : నల్లగొండ పోలీసుల మిషన్ పరివర్తన్.. గంజాయి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడిన వారికి సరికొత్త కార్యక్రమం..! 

District collector : రుణమాఫీ ఫిర్యాదుల విభాగం మండలాల్లో నిరంతరం నడిపించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Srisailam : శ్రీశైలంకు పెరిగిన భారీ వరద తాకిడి.. మరో రెండు గేట్లు ఓపెన్.. సాగర్ వైపు ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. Latest Update

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

మరిన్ని వార్తలు