TOP STORIESBreaking Newsviralజాతీయం

Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)

Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)

మన సాక్షి , వెబ్ డెస్క్ :

బావి భారత పౌరులను తయారు చేసే పాఠశాలల్లో ఉపాధ్యాయులే అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారు. తోటి ఉపాధ్యాయురాలును వేధిస్తున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఏదో ఒక చిన్న సాకు చూపించి వారిని లొంగదీసుకునే ప్రయత్నం ఉపాధ్యాయులు చేయటం గమనార్హం.

ఓ ఉపాధ్యాయురాలిపై ఉపాధ్యాయుడు వీడియో కాల్ లో నీచంగా ప్రవర్తించాడు. ఆమె హాజరుకు సంబంధించిన విషయాన్ని అడ్డం పెట్టుకొని ముద్దులు ఇవ్వమని అడిగాడు. ముద్దు ఇస్తేనే హాజరు వేస్తానని చెప్పాడు. అతడి చేష్టలను ఆ ఉపాధ్యాయురాలు వీడియో కాల్ లో రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతడి వ్యవహారం బయటపడింది.

ఉపాధ్యాయుడే నీచాతి నీచమైన చేష్టలకు పాల్పడిన విషయాన్ని విద్యార్థులు, విద్యార్థులకు తల్లిదండ్రులు నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో ఉపాధ్యాయురాలు విధులకు సంబంధించిన హాజరు శాతం విషయమై తోటి ఉపాధ్యాయుడికి చెప్పింది. దాంతో ఆయన వీడియో కాల్ లో “నీ హాజరు వేయాలంటే నాది ఒక షరతు ఉంది. అది చాలా సరదాగా ఉంటుంది. చాలా సులువుగా అవుతుంది” అని ఆ టీచర్ కు చెబుతాడు.

అయితే ఆమె “ఏమిటా షరతు” అని ఉపాధ్యాయురాలు అనగా ఆ ఉపాధ్యాయుడు సిగ్గుపడుతూ మురిసిపోతూ.. బుగ్గని చూపిస్తూ ముద్దు కావాలి అని అడుగుతాడు. అతడి వ్యవహారం పై విస్మయం చెందిన మహిళా టీచర్ నిరాకరించింది. ” నీ షరతుకు నేను అంగీకరించను అని, నీది చాలా దరిద్రమైన పని అంటూ జవాబు చెప్పి” తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఉపాధ్యాయురాలిని ముద్దు అడిగిన వీడియో నెట్ ఇంట్లో వైరల్ గా మారింది. దాంతో దుమ్మెత్తి పోస్తున్నారు. కొంత మంది ఆ ఉపాధ్యాయుడిని శిక్షించాలని, మరికొంతమంది చంప మీద కొట్టాలని, మరి కొంతమంది చెప్పుతో కొట్టాలని.. ఇలా వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది.

Video:

 

ఇవి కూడా చదవండి : 

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!

భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

మరిన్ని వార్తలు