వ్యాయామం, వాకింగ్ తో సంపూర్ణ ఆరోగ్యం
వ్యాయామం, వాకింగ్ తో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట, మన సాక్షి:
వ్యాయామం నడక మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఆహారం లో జాగ్రత్తలు పాటించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం వంతులుగా మెలగవచ్చునని సీనియర్ సివిల్ జడ్జ్ అలాగే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెకెరిట్రీ జి.శ్రీనివాసులు అన్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌక్ బజార్ నుండి పట్టణంలోని డాక్టర్స్ ర్యాలీ సత్యనారాయణ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ జి శ్రీనివాసులు హాజరై ఆయన మాట్లాడుతూ డిస్టిక్ లీగల్ సర్వీస్ ఉపాయోగలను వివరిస్తూ ప్రజల మధ్యన అవగాహన సదస్సులతో చట్టాలు హక్కుల గురించి డిస్టిక్ లీగల్ సర్వీస్ ద్వారా న్యాయం అందుతుందన్నారు .
అనంతరం జిల్లా ఆసుపత్రిలో కరోన విపత్కర పరిస్థితుల్లో పట్టణ ప్రజలకు కోవిడ్ ఇంజక్షన్ లను ఇచ్చి సేవాలందించిన సిస్టర్ సువిశేషమ్మను శాలువా జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డా మల్లికార్జున్, ఉపాధ్యక్షు రాలు శైలజ మల్లికార్జున్, కార్యదర్శి జయచంద్రమోహన్ కోశాధికారి గీతవిశ్వనాథ్ , జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రంజిత్ కుమార్ , వైద్యులు రాంబాబు మదన్ మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , రాజేష్ పద్మకళ , సౌజన్య ,అక్షిత ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.









