Breaking Newsతెలంగాణహైదరాబాద్

Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!

Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటిసారి జెండా పండుగ నిర్వహించనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గోల్కొండ కోటపై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను గోల్కొండ కోటపై ఎగరవేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిసారి జెండా పండుగ నిర్వహించబోతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గోల్కొండ కోటపై జెండా పండుగ నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఆ తర్వాత గ్రౌండ్ లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు.

ప్రసంగ కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా వివరించనున్నారు. జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను సిఎస్ శాంతి కుమార్ సోమవారం పర్యవేక్షించారు.

ALSO READ : 

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!

Nagarjunasagar : సాగర్ కి పోటెత్తిన టూరిస్టులు.. కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు..!

Cm Revanth Reddy : బతుకమ్మకు బహుమతి.. చీరలు బంద్..!

మరిన్ని వార్తలు