ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నూతన కమిటీ
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నూతన కమిటీ
సూర్యాపేట అధ్యక్షుడిగా డాక్టర్ తోట కిరణ్
సూర్యాపేట , మనసాక్షి
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సూర్యాపేట శాఖ అధ్యక్షుడిగా సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ తోట కిరణ్ ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా దంత వైద్యుల సంఘం ఎన్నికలు శుక్రవారం స్థానిక బృందావన్ గ్రాండ్ హోటల్ నందు జరిగాయి.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు డా.విక్రమ్ రెడ్డి, సూర్యాపేట డిఎంఎచ్ఓ డా కోటాచలం, సూర్యాపేట ఐ ఎం ఏ అధ్యక్షులు డా . బి ఎం చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా దంత వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ తోట కిరణ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మహేష్ పెద్దిరెడ్డి, కోశాధికారిగా డాక్టర్ దేవరశెట్టి దినేష్ ను ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రోజు రోజుకు పెరుగుతున్న దంత సమస్యలను అధునాతన పద్ధతిలో ఎలా పరిష్కరించాలో చర్చించడం జరిగింది. డా. కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం సహకరించి ప్రతి పి హెచ్ సి లో, బస్తీ దవఖానాలో ఒక దంత వైద్యుని నియమిస్తే ప్రజలు దంత సమస్యలతో బాధపడకుండా తమ వంతు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ దంత వైద్యులు డా. శేఖర్ రెడ్డి, డా నిర్మల్ కుమార్, డా . రంజిత్,డా యశ్వంత్ మరియు కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి నుంచి దాదాపు 50 మంది దంత వైద్యులు పాల్గొన్నారు.









