తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

మిర్యాలగూడ : నాగార్జునసాగర్ మేజర్ లకు సాగునీటి విడుదల..!

మిర్యాలగూడ : నాగార్జునసాగర్ మేజర్ లకు సాగునీటి విడుదల..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆనకట్టు పరిధిలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో మేజర్ లకు సాగునీటిని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ విడుదల చేశారు. వజీరాబాద్, ముల్కలకాల్వ మేజర్లకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం రుణ మాఫీ చేసిన సందర్భంగా రైతులు సంబురాల్లో ఉన్న సమయంలోనే భగవంతుడు కూడా కరుణించి రైతులకు సకాలంలో నీటిని అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ , ఈ ప్రభుత్వం ఎల్లపుడూ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్ముడు బోయిన అర్జున్, గుండు నరేందర్, శంకర్ రెడ్డి, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

BREAKING : రేపు ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తివేత.. హై అలర్ట్..!

Accident : రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం..!

Nagarjunasagar : సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు టైం ఫిక్స్.. Latest Update 

WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక లవర్స్ సేఫ్..!

మరిన్ని వార్తలు