TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాల నిషేధం అయినట్టేనా.. ఎమ్మెల్యే ఆదేశాలు గాలికి..!

Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాల నిషేధం అయినట్టేనా.. ఎమ్మెల్యే ఆదేశాలు గాలికి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం జాడ కూడా కనిపించడం లేదు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. విక్రయదారులు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలను గాలికి వదిలినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలని స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పూర్తిగా విక్రయాలను నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన ప్లాస్టిక్ విక్రయ వ్యాపారులను కలిసి కూడా తెలియజేశారు.

నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడను స్వచ్ఛ మిర్యాలగూడ గా మార్చడమే తన లక్ష్యమని అందులో భాగంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించారు. కానీ మిర్యాలగూడ పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు జోరుగా విక్రయిస్తూనే ఉన్నారు. గతంలో మాదిరిగానే వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో ఎమ్మెల్యే ఆదేశాలను పట్టించుకోలేదని తెలుస్తోంది.

జాడ లేని మున్సిపల్ అధికారులు :

ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను నిలిపివేయాలని ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు కనీసం తనిఖీలు కూడా చేపట్టలేదు. వ్యాపారస్తుల వద్ద లక్షల కొద్ది ప్లాస్టిక్ కవర్ల నిల్వలు ఉన్నప్పటికీ, కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల విక్రయదారులతో కనీసం మున్సిపల్ అధికారులు సమావేశం కూడా నిర్వహించలేదని తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాలను కనీసం మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.

ముందుకు రాని స్వచ్ఛంద సంస్థలు :

స్థానిక ఎమ్మెల్యే నేను నా మిర్యాలగూడ అనే స్వచ్ఛంద కార్యక్రమం లో భాగంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించే విషయంలో స్వచ్ఛంద సంస్థల వారు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.

ఎమ్మెల్యే ఆదేశాల కంటే ముందు ఏ విధంగా విక్రయాలు కొనసాగుతున్నాయో ఆగస్టు 15 తర్వాత కూడా అదే విధంగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 తర్వాత ప్లాస్టిక్ కావాలని విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయగా యధావిధిగా విక్రయాలు జరుగుతుండడంతో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

ALSO READ : 

Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

కరెంటు బిల్లుల చెల్లింపు పై కీలక ప్రకటన..!

Job Mela : రేపు మెగా జాబ్ మేళా, సద్వినియోగం చేసుకోండి.. జిల్లా ఎస్పీ..!

ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు