Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయంసూర్యాపేట జిల్లా
KCR with Farmers : రైతులతో కేసీఆర్.. అండగా ఉంటానని భరోసా..!
KCR with Farmers : రైతులతో కేసీఆర్.. అండగా ఉంటానని భరోసా..!
సూర్యాపేట , మన సాక్షి:
మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ నేత కెసిఆర్ పల్లెబాట పట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ప్రజల్లోకి కేసిఆర్ వెళ్లారు. తొలిసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటిస్తున్నారు. పంటలు ఎండిపోతున్న రైతులతో ముచ్చటించారు. ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో SRSP ఆయకట్టు కింద ఎండిపోయిన పొలాలను పరిశీలించి ,రైతులను వివరాలను అడిగి తెల్సుకున్నారు. ఆయన వెంట.మాజీ మంత్రి , సూర్యపేట MLA జగదీష్ రెడ్డి.mla పల్లా రాజేశ్వర్ రెడ్డి… MP లింగయ్య యాదవ్..తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తదితరులు ఉన్నారు.









