Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

KCR : కర్ర సహాయంతో నడుస్తున్న కెసిఆర్.. పోస్ట్ చేసింది ఎవరు (వీడియో వైరల్)

KCR : కర్ర సహాయంతో నడుస్తున్న కెసిఆర్.. పోస్ట్ చేసింది ఎవరు (వీడియో వైరల్)

హైదరాబాద్ , మన సాక్షి :

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) చేతి కర్ర సహాయంతో నడుస్తున్నారు. వీడియో వైరల్ గా మారింది. తుంటి ఆపరేషన్ అనంతరం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ప్రస్తుతం ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో కర్ర సహాయంతో నడుస్తున్నారు. కాగా కేసీఆర్ చేతి కర్ర సహాయంతో నడుస్తున్న వీడియోను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ద్రుడ సంకల్పంతో ప్రతి అడుగుతో కేసిఆర్ బలాన్ని తిరిగి పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే సాఫీగా నడిచి అందరి ముందుకు వస్తారని సంతోష్ తెలిపారు.

ALSO READ : Online app : ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొచ్చా.. నల్గొండ జిల్లా యస్.పి చందనా దీప్తి ఏం చెప్పారో చూడండి..!

చేతి కర్ర సహాయంతో కేసీఆర్ నడుస్తున్న వీడియోలు (బి ఆర్ ఎస్) కార్యకర్తలు, ఆయన అభిమానులు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో కార్యకర్తలు వివిధ రకాల కామెంట్స్ పెడుతున్నారు.

ఆయన తుంటి ఆపరేషన్ వల్ల శాస్త్ర చికిత్స అనంతరం కొద్ది రోజులపాటు హైదరాబాదులోని ఆయన నివాసంలో ఉన్నారు. ఆ తర్వాత ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా బుధవారం వైద్యులు తోడు ఉండగా కేసీఆర్ నడవటం మొదలుపెట్టారు. త్వరలోనే ఆయన పూర్తిస్థాయిలో కోలుకొని ప్రజల్లోకి వస్తారని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

KCR VIDEO 👇

మరిన్ని వార్తలు