తెలంగాణBreaking Newsనల్గొండవిద్య
Miryalaguda : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!
Miryalaguda : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కే ఎల్ ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో జాతీయస్థాయి ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరీలలో కే ఎల్ ఎన్ కళాశాలకు చెందిన విద్యార్థులు బి మోహిత్ రాజనాయక్ (ఆల్ ఇండియాలో 19వ ర్యాంకు) సాధించి జిల్లాలో అగ్రగామిగా నిలిచినట్లు కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. అతనితో పాటు డి.ఆనంద్ (ఆల్ ఇండియా 1840 ర్యాంకు) సాధించినట్లు ఆయన తెలిపారు.
అదే విధంగా ఇంటర్మీడియట్ తో పాటు ఎప్ సెట్, ఐఐటి, నీట్‌లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన ఏకైక విద్యాసంస్థ కే ఎల్ ఎన్ కళాశాల అని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు పి ఎల్ ఎన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి అభినందించారు.
MOST READ :
-
BhoBharati : భూభారతి సదస్సులు.. రేపటి నుంచి ఏ తేదీలలో ఎక్కడ..!
-
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్.. (02/06/2025)
-
Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!
-
BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!
-
RBI : కరెన్సీ నోట్లపై ఆర్బిఐ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!









