Nalgonda : కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరాలి.. కేఏ పాల్ సంచలన ప్రకటన..!
Nalgonda : కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరాలి.. కేఏ పాల్ సంచలన ప్రకటన..!
నలగొండ, మనసాక్షి :
వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున యువ అభ్యర్థులను బరిలో దింపనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే గా ఏ పాల్ వెల్లడించారు. గత పాలకులు, ప్రస్తుత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని పాల్ ఆరోపించారు. శనివారం నల్గొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కాగల వ్యక్తి అని.. కానీ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు అన్యాయం జరుగుతోందని పాల్ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తన వెంట వస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఆర్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరాలని, కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి కన్నా వెయ్యిరెట్ల బలం కలిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకులని తెలిపారు.
ఒక బ్రదర్ సీఎం క్యాండిడేట్ అయితే తమ్ముడు హోమ్ మినిస్టర్ క్యాండిడేట్ కలిగిన వాళ్లని, ఇంత బలం ఉన్నా గాని నల్లగొండ జిల్లాకు వీరు చేసిందేమీ లేదని ఆరోపించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి సొంత జిల్లాలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని, దేవరకొండ నుంచి నల్లగొండ రోడ్డు మార్గం ప్రయాణం చేస్తే చాలు వీరి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలిసిపోతుందన్నారు.
గత ప్రభుత్వాలు శంకుస్థాపన చేసిన వాటిని ప్రారంభం చేసి మేమే చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొడుతోందని ఆరోపించారు కే ఏ పాల్. నల్లగొండ దత్తత తీసుకుంటా అన్న కేసీఆర్ కనుమరుగైపోయాడన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఆర్.ఆర్ టాక్స్ వసూళ్లు చేస్తున్నారని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని పాల్ తెలిపారు. కేటీఆర్ తప్పులు చెస్తే అరెస్టు చేయాలని, కానీ రాజకీయ కక్షతో కాదని పాల్ చెప్పారు.
అంతకంటే ముందు వందల మంది తప్పులు చేసిన వారు మోసం చేసిన వారు ఉన్నారని, వాళ్ళను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కే ఏ పాల్ ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్య లాంటి మంచి నేత కూడా బీజేపీ కీ సపోర్ట్ చేయడం బాధాకరమని పాల్ అభిప్రాయ పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు తన పార్టీకి మద్దతు ఇవ్వాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని తెలిపారు. ఆర్ఆర్ టాక్స్ కట్టని వారి బిల్డింగులు హైడ్రా పేరుతో 432 బిల్డింగులు కూల్చారని, పర్మిషన్లు ఇచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను, ఇంజనీర్లను, ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. నల్గొండ లో ఔటర్ రింగ్ రోడ్డు మాటల్లోనే గాని చేతల్లో లేదని విమర్శించారు కే ఏ పాల్. ఉమ్మడి రాష్ట్రం నుండి ఐదు శాతం ఉన్న రెడ్డిలు 12సార్లు ముఖ్య మంత్రి పదవులు అనుభవించారని, 60 శాతం ఉన్న బీసీలు ఆంధ్ర, తెలంగాణలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదని తెలిపారు.
కాంగ్రెస్ , బిఆర్ఎస్ రెండు ఒకటేనని, బీసీలపై ప్రేమ ఉంటే బిసి ముఖ్యమంత్రిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులు, కోమటి రెడ్డి బ్రదర్స్ అందరూ రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరితే కచ్చితంగా గెలుస్తారని వారికి కూడా తెలుసు అని.. వారికి రాజకీయ అనుభవం ఉందని కే ఏ పాల్ తెలిపారు. 100% అభివృద్ధి తాను చేసి చూపిస్తానని, అప్పులు కూడా తీరుస్తానన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ వీరిద్దరి వల్ల అభివృద్ధి కాదని ప్రజలకు తెలిసిపోయిందని, గ్రామాల్లో బిజెపి పార్టీ నామమాత్రం గానే ఉందని.. అందుకే ఈ పార్టీలను గుడ్ బై చెప్పి వచ్చే స్థానిక ఎన్నికలలో బీసీ మద్దతు పార్టీగా ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.
ఈసారి సర్పంచ్ ఎన్నికలొ గెలిచేవారు తమ పార్టీలోకి రావాలని, తద్వారా ఊర్లను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని, ఈసారి తెలంగాణలో బీసీ పాలన రావాలి అని కోరుకుంటున్నానని, ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు 2000, 3000రూ ఇచ్చి ఓటర్లను గొర్రెలుగా తయారు చేస్తున్నారని ఆరోపించారు.
మోహన్ బాబు తో మాట్లాడించి మీడియాతో క్షమాపణలు చెప్పించానని, మీడియా మిత్రులకు ఏ సమస్య ఉన్నా తాను అండగా ఉంటానని తెలిపారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురు శిష్యులని… ఎవరి పాలన బాగుందంటే ఎవరు మర్డర్ బాగా చేశారు.. అడిగినట్లుందని ఎద్దేవా చేశారు కే ఏ పాల్. ప్రెస్ మీట్ అనంతరం ప్రెస్ క్లబ్ కు మొదటిసారి విచ్చేసిన డాక్టర్ కేఏ పాల్ కు నల్లగొండ ప్రెస్ క్లబ్ తరఫున జ్ఞాపిక అందజేశారు.
MOST READ :
-
TG News : అసెంబ్లీ వేదికగా రైతులకు భారీ గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఖాతాలలో డబ్బులు..!
-
Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..!
-
District collector : జిల్లా కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్మే వికలాంగ మహిళకు..!
-
ACB : ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై కేసు.. ఆయన ఫస్ట్ రియాక్షన్..!









