జాతీయంBreaking NewsTOP STORIESవ్యవసాయం

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టం చేరాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలకు ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో పాటు కృష్ణానది ఉపనది తుంగభద్రకు కూడా వరద పోటు పెరిగింది. త్వరలో శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపుకు వరద నీరు రానున్నది.

ఆల్మట్టి ప్రాజెక్టుకు 81,333 క్యూసెక్కుల నీరు వరద వస్తుండగా 14 గేట్లను ఎత్తి దిగువకు 65 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. 65 వేల క్యూసెక్కుల నీరు నారాయణపూర్ ప్రాజెక్టుకు చేరుతుంది. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 123 పిఎంసిలకు గాను ప్రస్తుతం 100 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 33 టీఎంసీల గాను ప్రస్తుతం 31 టిఎంసిల నీళ్లు ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు 65 వేలకు కృషకులన్నీటిని వదులుతున్నారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.6 టిఎంసిలకు రాను ప్రస్తుతం 7.90 ఎంసీల నీళ్లు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని దిగకు వదులుతున్నారు.

త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద నీరు :

కృష్ణానది ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. పైనుంచి ఇదే విధంగా వరద నీరు చేరితే మరి కొద్ది రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు నాగర్జున సాగర్ కూడా వరద నీరు చేరే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ జలాశయానికి నీటిని వదులుతున్నారు. సాగర్ జలాశయానికి ప్రస్తుతం 19 వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. దాంతో సాగర్ ఆయకట్టు రైతుల ఆశలు పదిలంగా ఉండనున్నాయి. ఇదేవిధంగా వరద నీరు కొనసాగితే ఆగస్టులో జలాశయం లోకి సమృద్ధిగా నీరు చేరే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : 

తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో, సాగర్ ఆయకట్టులో ఆశలు..!

Pds Rice : 330 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం.. 11 కేసులు..!

మరిన్ని వార్తలు