తెలంగాణBreaking Newsక్రైంహైదరాబాద్

Hyderabad : కేటీఆర్ బావమరిది జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..!

Hyderabad : కేటీఆర్ బావమరిది జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ శివారులోని జన్వాడలో ఉన్న కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ లో రేపు పార్టీ జరుగుతున్నట్లుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.

ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించగా 21 మంది పురుషులు, 14 మంది మహిళలు తోపాటు లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుగుతుందని, విదేశీ మద్యం సహా భారీగా లెక్కను స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 10.5 లీటర్స్ విదేశీ మద్యం, 10 లూస్ ఇండియన్ లిక్కర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని పట్టుబడిన వారిపై U/S 34A, 34(1) ,R/W 9  OF ఎక్సైజ్ ఆక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కాగా ఈ పార్టీలో విజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని టెస్ట్ పంపించగా కొకైన్ తీసుకున్నట్లు తేలింది. అతడిని అరెస్టు చేశారు.

అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రేవు పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలపై ఎక్సైజ్ ఆక్ట్ కింద కేసులు నమోదు చేశారు.  నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు దాడులలో పాల్గొన్నారు.  రాజ్ పాకాల తో పాటు ఫామ్ హౌస్ మేనేజర్లు కార్తీక్, రాజేంద్రప్రసాద్ పై కేసులు నమోదు చేశారు.

MOST READ :

మరిన్ని వార్తలు