Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ కి తాము సిద్ధంగా ఉన్నామని రైతు సంక్షేమంపై ఆయన చేసిన సవాల్ కు ప్రిపరేషన్ కోసం ఆయనకే 72 గంటల సమయం ఇస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ చేశారు.

అసెంబ్లీలో చర్చ పెడతారా.. లేక రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి లో చర్చ పెడతారా.. కెసిఆర్ స్వగ్రామం చింతమడకలో చర్చ పెడతారా.. మీ ఇష్టం ప్లస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమే.. మేము ఎప్పుడైనా రెడీ.. అంటూ ఆయన సంచలన సవాల్ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు ఒక్కరే వచ్చినా సరే.. వెంట కార్యకర్తలను తెచ్చుకున్న సరే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బేసిన్ కు బేసిక్ కు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉన్నారని, రేవంత్ రెడ్డి స్థాయికి కేసిఆర్ అవసరం లేదని తాము చాలని ఆయన అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తాము ఉద్యమం నడిపితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు ఆయన సన్నిహితులకు ఇచ్చుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.

రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారని, పదేళ్లు రైతు కేంద్రంగా ప్రభుత్వం నడిపించాము. ఎరువులు పంపిణీ చేయడానికి చేతకాని మీరు.. కేసీఆర్ ను చర్చకు పిలుస్తారా.. అంటూ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడ, ఎవరు చేయలేదని, సీఎం సభ పెట్టారంటే బూతులు, చాలెంజ్ లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి ది కాదు.. మీకు మేము సరిపోతాము. బనకచర్ల తో గోదావరి నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర చర్యలకు రేవంత్ రెడ్డి కూడా వంతపడుతుంటే ప్రజలు చూస్తున్నారన్నారు. రైతులకు ఎవరు ఏం చేశారో..? ప్రజలకు తెలుసని ఎన్నికల కోసమే రైతు భరోసా ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు.

MOST READ : 

  1. District collector : లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన..!

  2. District collector : రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలల్లో అన్నీ సమస్యలే.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!

  3. Nalgonda : ఎరువుల నిల్వల్లో తేడా వస్తే కఠిన చర్యలు.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!

  4. Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Paddy Cultivation : వరి నాట్ల హడావిడి.. రైతులు బిజీ బిజీ..!

మరిన్ని వార్తలు