Suryapet : ఎత్తిపోతల భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి.. భూసేకరణ కమీషనర్ ఆదేశం..!
Suryapet : ఎత్తిపోతల భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి.. భూసేకరణ కమీషనర్ ఆదేశం..!
సూర్యాపేట, మనసాక్షి
జిల్లాలోని నాలుగు కొత్త ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని రేవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశ మందిరము లో ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన నాలుగు ఎత్తిపోతల పథకాలైన, బెట్ట తండా లిఫ్ట్ ఇరిగేషన్ పాలకీడు మండలం, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం చింతలపాలెం మండలం, రెడ్ల కుంట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కోదాడ మండలం, ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనంతగిరి మండలం చెందిన నాలుగు ఎత్తిపోతల పథకాలు జిల్లాకు మంజూరు అయ్యాయని తెలిపారు.
వీటి ఏర్పాటు కొరకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి ఇరిగేషన్ శాఖకు అప్పగించాలని అలాగే ఇరిగేషన్ అధికారులు ఈ నాలుగు ఎత్తిపోతల పథకాల పనులు త్వరగా పూర్తి చేయవలసిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి రాంబాబు, ఇరిగేషన్ ఎస్సీ శివ ధర్మ తేజ, రామకిషోర్ డీఐఓ ప్రేమ్చంద్, భూ సేకరణ విభాగం సూపర్ సీనియర్ అసిస్టెంట్ ఆకాష్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!
-
Penpahad : యూరియా సరఫరాకు చర్యలు.. మనసాక్షి కథనానికి స్పందించిన వ్యవసాయ అధికారి..!
-
Liquor : కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు అరెస్ట్.. ముగ్గురు బైండోవర్..!









