viralBreaking Newsజాతీయం

Viral Video : వడ్డానం అనుకుందాం ఏంది..? పాముని పట్టుకుని అలా చేసింది.. (వీడియో)

Viral Video : వడ్డానం అనుకుందాం ఏంది..? పాముని పట్టుకుని అలా చేసింది.. (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్:

చిన్న చిన్న పురుగులు చూస్తేనే మహిళలు భయపడుతుంటారు. బొద్దింకలు, బల్లులు అలాంటి వాటికే మహిళలు భయపడుతుంటారు. కానీ ఆ మహిళ మాత్రం ఏకంగా పాముని నడుముకు చుట్టుకుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు అవాక్కైతున్నారు.

వివరాల ప్రకారం.. ఓ కళాశాల ఆవరణలో విద్యార్థులంతా ఉండగా ఓ పామును చూసి భయపడ్డారు. అయితే అక్కడ ఓ యువతి మాత్రం ఏ మాత్రం భయపడకుండా పాముని పట్టుకుంది. గడ్డి పొదల్లోకి వెళ్లిపోతున్న పామును పట్టుకొని బయటకు తీసి నడుముకు చుట్టేసుకుంది. ఆ సమయంలో పాము ఆమెను కాటేసేందుకు ప్రయత్నించింది. అయినా ఆ యువతి పామును మాత్రం వదల్లేదు. పట్టుకొని తీసుకెళ్లి పక్కకు వదిలేసింది. అయితే అక్కడ ఉన్న వారంతా ఆమె పామును పట్టుకున్న వైనం చూసి అవాక్కయ్యారు.

కొందరు విద్యార్థులు అయితే భయపడి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజెన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అనుభవం ఉన్నవారు మాత్రమే ఇలాంటి సాహసాలు చేయాలి. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే వడ్డానం అనుకుందా ఏంటి..? అంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియో లక్షల కొద్ది వ్యూస్ సంపాదించుకుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు