TOP STORIESBreaking Newsవ్యవసాయం

Cm Revanth Reddy : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి..!

Cm Revanth Reddy : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ గందరగోళం నెలకొన్నది. రెండు లక్షల రూపాయల లోపు రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా మూడు విడతలుగా రుణమాఫీ చేశారు. సుమారు 22 లక్షల మందికి 18 కోట్ల రూపాయలను వారికి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేశారు.

కానీ అనేక సాంకేతిక కారణాలవల్ల చాలా మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో సాంకేతిక కారణాలను అధిగమించేందుకు గాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు నెలాఖరులోగా తీసుకున్నారు.

సెప్టెంబర్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రైతుల ఇండ్లకు వ్యవసాయ అధికారులు నేరుగా వెళ్లి కుటుంబ నిర్ధారణ నిర్వహించారు. రైతుల ఫోటోలను వివరాలను నేరుగా రైతు భరోసా యాప్ లో అప్లోడ్ చేశారు.

ఆధార్ కార్డు, బ్యాంకు ఎకౌంట్లో తప్పులు ఇతర కారణాలతో ఉన్న సుమారు ఐదు లక్షల మంది రైతుల కుటుంబ సర్వే పూర్తయింది. దాంతో ప్రభుత్వం రుణమాఫీ అర్హుల జాబితాను తయారు చేసినట్లు సమాచారం. కాగా రుణమాఫీ కానీ రైతులందరికీ కూడా దసరా పండుగ లోపే వారి వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

సుమారు 5000 కోట్ల రూపాయలను రుణమాఫీకి విడుదల చేసి రైతుల ఖాతాలలో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా రుణమాఫీ కానీ సుమారు నాలుగు లక్షల మందికి పైగా దసరా లోపు వారి వారి ఖాతాలలో డబ్బులు జమ కానున్నవి.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు