Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
BIG BREAKING : లారీ బీభత్సం.. ఆరుగురు మృతి, ఏడుగురికి గాయాలు..!
BIG BREAKING : లారీ బీభత్సం.. ఆరుగురు మృతి, ఏడుగురికి గాయాలు..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఆరుగురు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.
కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా ఆ సమయంలో లారీ అదుపు తప్పి కూరగాయల వ్యాపారుల పైకి వెళ్ళగా అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కూరగాయల వ్యాపారులు సుమారుగా 50 మందిపైగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :









