Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Mangos : మామిడి పండ్లు సింపుల్ గా మాగ పెట్టొచ్చు.. ఎలానో తెలుసా..?

Mangos : మామిడి పండ్లు సింపుల్ గా మాగ పెట్టొచ్చు.. ఎలానో తెలుసా..?

మనసాక్షి డెస్క్:

వేసవి కాలం వచ్చిందంటే మామిడిపండ్ల సీజన్ వచ్చినట్టే… మామిడి పండ్లకు ఈ సీజన్లోనే గిరాకీ కూడా ఉంటుంది. మామిడిపండ్ల ను అందంగా పసుపు రంగులో ఉండే విధంగా చేసి వ్యాపారులు విక్రయిస్తుంటారు.

 

కొనుగోలుదారులు కూడా అలాంటి మామిడి పండ్లను చాలా ఇష్టపడుతుంటారు. కానీ వాటిని వివిధ రకాల కెమికల్స్ తో  అలా చేస్తుంటారు.  వాటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

 

అలా కాకుండా మనం మామిడి పండ్లను సొంతంగా మాగ పెట్టుకుంటే ఆరోగ్యం ఉండటంతో పాటు ఎక్కువ తీపి కూడా ఉంటాయివ బాగా పెట్టుకోవడం చాలా సింపుల్…!

 

ఎలా అంటే మామిడి చెట్టు మీద నుంచి పండుకు వచ్చిన కాయలను తెంపి ఒక బాక్స్ లో ఎండు గడ్డి ఒక వరుస పెట్టి.. పైనుంచి మామిడి కాయలను వేసి కాయలపై నుంచి తిరిగి ఎండు గడ్డి కప్పి … బాక్స్ లోపలికి గాలి తగలకుండా మూత వేయాలి . అలా వేస్తే కాయలు పండుతాయి. వీటిలో కింద పడిన కాయలు దెబ్బ తగిలినవి పగిలిన కాయలు వేయకూడదు. అలా వేస్తే అవి పాడైపోతాయి.

 

మాగపెట్టిన మామిడికాయలను ప్రతిరోజు చూసి పండు పండిన వాటిని తీస్తుండాలి. మనం మాగపెట్టిన తర్వాత రెండు మూడు రోజుల్లో బాగా పండుతాయి.

మరిన్ని వార్తలు