District collector : మిల్లర్లు గడువులోగా CMR డెలివరీ చేయాలి.. జిల్లా కలెక్టర్..!
District collector : మిల్లర్లు గడువులోగా CMR డెలివరీ చేయాలి.. జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సీఎంఆర్ బియ్యం ను నిర్ణీత గడువులోపు డెలివరీ చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మిల్లర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సీఎంఆర్ డెలివరీలో ఆలస్యంపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిల్లు పట్టిన బియ్యాన్ని (సీఎంఆర్) ఎఫ్.సి.ఐ కి నిర్ణీత సమయంలో చేరవేయడంలో అలసత్వం వహించకూడదన్నారు. 2021-22 ఖరీఫ్ సీజన్ సంబంధించి సీఎంఆర్ ను సకాలంలో అందించాలని ఆమె తెలిపారు. అదేవిధంగా 2022-23 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారంలోగా సీఎంఆర్ బియ్యాన్ని ఇచ్చేలా మిల్లర్లు కృషి చేయాలని తెలిపారు.
మిల్లర్లు నిర్ణీత సమయానికి సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకపోవడం వల్ల సమయాన్ని పెంచుతూ పోవడం మంచి పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. మిల్లర్ల యాజమాన్యాలు, యూనియన్ నాయకులు కలిసి ఒక్క తాటి పైకి వచ్చి సీఎంఆర్ ను నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యేలా చూడాలని ఆమె తెలిపారు.
రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులు సమిష్టిగా పని చేస్తూ సీఎంఆర్ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మిల్లింగ్ అయ్యేలా డిప్యూటీ తహసీల్దారులు తమ కార్యచరణను రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
డిప్యూటీ తహసిల్దారులు తమ రోజువారి టూర్ డైరీలలో ఏఏ మిల్లులను సందర్శించారో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సూచించారు. కాగా సమావేశంలో పలువురు రైస్ మిల్లర్లు తమ సమస్యలను, సిఎంఆర్ లక్ష్య సాధనలో ఏర్పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ దేవదాస్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చల్లా శ్రీరాములు, మాజీ అధ్యక్షుడు చల్లా సంతోష్, సభ్యులు హర్ష, భరత్, పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దార్లు పాల్గొన్నారు.
ALSO READ :
NARAYANPET : హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదు.. ఎంపీ డీకే అరుణ..!
Narayanpet : పేటలో బంద్ సంపూర్ణం.. తెరుచుకోని దుకాణాలు, మూతపడిన విద్యా సంస్థలు..!
మిర్యాలగూడ : రైస్ మిల్లుల్లో విస్తృతంగా మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాలి..!









