Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, చిట్యాల :

తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందజేసే రైతు భరోసా పథకం పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటివరకు కేవలం 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా పంట సహాయంగా ఎకరానికి 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశారు. అయితే మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకం పై కీలక ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైతులకు మంచి రోజులు వస్తున్నాయన్నారు.

దేశవ్యాప్తంగా ఎక్కువ వరి ధాన్యాన్ని సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఈసారి తొలకరి ముందస్తుగానే పలకరించిందని రైతులు పంటలు సాగు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. కాగా ఈసారి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో అనుకున్న సమయంలోనే వేస్తామని ప్రకటించారు. వానాకాలం నాట్లు పెట్టక ముందే రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 21 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిందన్నారు.

తెలంగాణ రైతులను కాపాడుకోవడమే ప్రభుత్వ ముఖ్య ఆశయమన్నారు. నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఎక్కువగా సాగవుతున్నాయనే ఆయిల్ ఫామ్ కంపెనీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. తక్కువ నీటితో పండే పంటలను రైతులు ఎంచుకోవాలని ఆయన కోరారు. నార్కట్ పల్లి కి కూడా నూతన వ్యవసాయ మార్కెట్ ను మార్కెట్ చేస్తామని తెలియజేశారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!

  2. Rythu : నేల సారం పెంచుకునేందుకు ఇలా చేయాలి.. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన..!

  3. Seeds : విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులు..!

  4. Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!

మరిన్ని వార్తలు