Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : అప్రమత్తంగా ఉండి యూరియా బుక్ చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
రైతులు ఈ వారం రోజులు కీలకంగా భావించి అప్రమత్తంగా ఉంటూ యూరియా బుక్ చేసుకోవాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరారు.

Miryalaguda : అప్రమత్తంగా ఉండి యూరియా బుక్ చేసుకోవాలి.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతులు ఈ వారం రోజులు కీలకంగా భావించి అప్రమత్తంగా ఉంటూ యూరియా బుక్ చేసుకోవాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రానున్న వారం రోజులు చాలా కీలకమైనవి అని, వారం రోజులు రైతులు ఇప్పటివరకు ఇచ్చిన యూరియా కంటే అధికంగా సొసైటీలలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా తెలియజేశారు. దాంతో జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ వారం రోజుల పాటు సరిపడే యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వారం రోజులపాటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు.
ఇవీ చదవండి
- Farmer Registration : రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ముగియనున్న గడువు..!
- సూర్యాపేటలో ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డే.. అమెరికా సామ్రాజ్యవాదంపై చర్చ..!
- Miryalaguda : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
- BREAKING : ఆంధ్రప్రదేశ్ లో భూకంపం.. ఆ జిల్లాలో ప్రకంపనలు..!










