Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్‌లో నాగుపాము కలకలం..!
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ 17వ వార్డులో నివాసం ఉంటున్న పానుగోత్ సైదా నాయక్ ఇంట్లో ప్రమాదకరమైన నాగుపాము కనిపించింది.

Miryalaguda : మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్‌లో నాగుపాము కలకలం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ 17వ వార్డులో నివాసం ఉంటున్న పానుగోత్ సైదా నాయక్ ఇంట్లో ప్రమాదకరమైన నాగుపాము కనిపించింది. విషయం తెలుసుకున్న వార్డు మాజీ కౌన్సిలర్ లావూరి రవి నాయక్ వెంటనే స్థానిక కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డికి సమాచారం అందించారు. వార్డు ప్రజల భద్రత దృష్ట్యా కౌన్సిలర్ వెంటనే స్పందించి స్నేక్ క్యాచర్‌ను పిలిపించి పామును సురక్షితంగా పట్టించారు. సకాలంలో స్పందించి ప్రమాదాన్ని తప్పించిన కౌన్సిలర్ కి, రవి నాయక్ కి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలుపారు.









