Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయం

Miryalaguda : యూరియా యాప్ పై జిల్లా కలెక్టర్ కు రైతుల మెర..!

యూరియా యాప్ పై నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్ కు రైతులు మొరపెట్టుకున్నారు.

Miryalaguda : యూరియా యాప్ పై జిల్లా కలెక్టర్ కు రైతుల మెర..!

మిర్యాలగూడ, మన సాక్షి:

యూరియా యాప్ పై నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్ కు రైతులు మొరపెట్టుకున్నారు. బుధవారం రైతుబంధు మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు వారిని కలిసి వినతిపత్రం అందజేశారు

ఈ సందర్భంగా చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యూరియా విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ 90% మంది రైతులు ఫర్టిలైజర్ యాప్ ని వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. ఫోన్ వాడడం సరిగ్గా తెలియని రైతులు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫెర్టిలైజర్ యాప్ ని ఉపయోగించి ఓటీపీలు లాంటివి చేసి ఎలా యూరియాని బుక్ చేసుకోగలుగుతారని అన్నారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి యూరియా యాప్ తో కాకుండా డైరెక్ట్ గా రైతులకు యూరియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల మాజీ జెడ్పిటిసి ఆంగోతు హాథిరాం నాయక్, సర్పంచులు పిసికే ప్రసాద్, కృష్ణయ్య ,పుట్టల సందీప్, శేఖర్ రావు, సాగర్ నాయక్ మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, రైతులు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలు