Miryalaguda : ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో దాన్యం కొనుగోలు చేయాలని రైతులు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై రాస్తారోకో చేశారు.

Miryalaguda : ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో..!
వేములపల్లి మన సాక్షి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో దాన్యం కొనుగోలు చేయాలని రైతులు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం మిల్లుల దగ్గర మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదనడంతో రైతులందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నల్లగొండ రోడ్డు మీద రాస్తారోకో నిర్వహించినారు.
రైస్ మిల్లర్లతో సమావేశం :
రైస్ మిల్లర్లతో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, డిఎస్పి రాజశేఖర్ రాజు సమావేశం నిర్వహించారు. రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు, రైస్ మిల్లర్లకు మధ్య సోమవారం జరిగిన వాగ్ వివాదం కారణంగా మిల్లర్లు కొనుగోలు నిలిపివేశారు. దాంతో రైతులు కొనుగోలు చేయాలని ఆందోళన నిర్వహించారు. కాగా అధికారులు, ప్రజా ప్రతినిధులు మిల్లర్లతో చర్చలు నిర్వహించగా మంగళవారం కొనుగోలు తిరిగి ప్రారంభమయ్యాయి.










