Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : పూజలు, మంత్రాల పేరుతో ఘరానా మోసం.. ఆమాయక ప్రజలే టార్గెట్..!

పూజలు, మంత్రాల, యంత్రాల పేరుతో ఘరానా మోసం చేస్తూ ప్రజల వద్ద నుండి బంగారం, డబ్బులను అక్రమంగా తీసుకుంటున్న నిందితున్ని మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు 30 గ్రాముల బజాగారపు చైన్, ముబైల్ స్వాధీనము చేసుకున్నారు.

Miryalaguda : పూజలు, మంత్రాల పేరుతో ఘరానా మోసం.. ఆమాయక ప్రజలే టార్గెట్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

పూజలు, మంత్రాల, యంత్రాల పేరుతో ఘరానా మోసం చేస్తూ ప్రజల వద్ద నుండి బంగారం, డబ్బులను అక్రమంగా తీసుకుంటున్న నిందితున్ని మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు 30 గ్రాముల బజాగారపు చైన్, ముబైల్ స్వాధీనము చేసుకున్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో మిర్యాలగూడ డి ఎస్ పి రాజ శేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడ ॥ టౌన్ పోలీస్ వారు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ 2 టౌన్ సి ఐ సోమనర్సయ్య, ఎస్సై బి. రాంబాబు మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

 ప్రధాన నిందితుని వివరాలు :

సూర్యాపేట జిల్లాఆత్మకూర్ (ఎస్) మండలము గట్టికల్ గ్రామము ఆయుర్వేదిక్ డాక్టర్ కోని వినోద్ కుమార్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో, జల్సాలకు అలవాటు పడిన వినోద్ నాటు వైద్యం, మంత్రాల పేరుతో అమాయకుల ప్రజల టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి అనారోగ్యం తగ్గిస్తాను అని నమ్మించి. నగదును, బంగారాన్ని మాయా మాటలు చెప్పు మోసం చేసే ముడుపుల రూపంలో తీసుకుంటున్నాడు.

అందులో భాగంగా మిర్యాలగూడ లోని రాఘవేంద్ర కాలనీ కి చెందిన ఆడవత్ శిరీష, ఆమె భర్త గోవింద్ కలిసి వారి ఇద్దర మగ పిల్లలను నూతనకల్ లో ఉన్న వినోద్ వద్దకు అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళి వినోద్ వద్ద పిల్లలకు కాళ్ళ కడియాలు ఇప్పించేవారు.

నిందితుడు వారి యొక్క నమ్మకాన్ని అదునుగా తీసుకొని వారికి ఏదైనా మాయ మాటలు చెప్పి వారిని మోసం చేయాలని నిర్ణయించుకొని, గత కొన్ని రోజుల క్రితం వినోద్ మిర్యాలగూడ లోని రాఘవేంద్ర కాలనీ లో గల సదరు శిరీష యొక్క కిరాయి ఇంటికి వెళ్ళి, శిరీష భర్త అయిన గోవింద్ వైపు చూసి నీకు ప్రాణహాని ఉందని, ఆయుష్షు పెందాలంటే పూజ చేయాలి. దేవతకు ముడుపు కట్టాలి అని చెప్పి భయపెట్టి సుమారు 5.7 తులాల బంగారం , 13,200/- ఫోను ద్వారా తీసుకున్నాడు.

ముడుపు పేరిట బంగారాన్ని గుడ్డలో కట్టి 41 రోజులు విప్పవద్దని చెప్పి వారు కళ్ళు మూసుకుని ప్రార్ధన చేస్తున్న సమయంలో బంగారాన్ని తీసుకున్నాడు. ఇట్టి విషయమై మిర్యాలగూడ టూ టౌన్ పియస్ లో కేసు నమోదు అవ్వగా, ఇట్టి కేసులో ఈరోజు నిందితుడిని పట్టుబడి చేసి, రిమాండ్ చేయమైనది. ఇట్టి కేసులో విచారణ జరిపి నేరంలో భాగస్తులైన ఇతర నేరస్తులను కూడా త్వరలో అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు.

నిందితుడు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది:

  • మేళ్లచెరువు గ్రామంలో పెళ్లి పేరు చెప్పి 5 తులాల బంగారం తీసుకుని IndianMoney.com ద్వారా గోల్డ్ లోన్ తీసుకున్నాడు.
  • సకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో ఒక కుటుంబాన్ని బెదిరించి బంగారం తీసుకుని లోన్ పొందాడు.
  • సూర్యాపేట పట్టణంలో కూడా ఇలాంటి పద్ధతిలో బంగారం మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు.
  • నూతనకల్ మండలం పెద్దనమలి గ్రామంలో ఒకరిని వారం రోజుల్లో చనిపోతావని భయపెట్టి బంగారం, వెండి
    నగదు తీసుకున్నాడు.

MOST READ : 

  1. Breaking : తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..!
  2. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు.. క్యాబినెట్ లో చర్చించారా..?
  3. Gold Price Today : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియుల్లో ఆందోళన..!
  4. Friendship : స్నేహితులంతా ఒక్కటయ్యారు.. తోటి మిత్రుడు కుటుంబాన్ని ఆదుకున్నారు..! 

మరిన్ని వార్తలు