తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

Miryalaguda : ఫిర్యాదులు వస్తే ఉద్యోగం తొలగిస్తాం.. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

Miryalaguda : ఫిర్యాదులు వస్తే ఉద్యోగం తొలగిస్తాం.. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హెచ్చరించారు.

బుధవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలోని ఓ పి, చిన్నపిల్లల విభాగం ,కంటి విభాగం, ల్యాబ్ ,కాన్పుల గది, మహిళ, పురుష వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ కేంద్రం, అన్ని విభాగాలను తనిఖీ చేయడమే కాకుండా, ఆస్పత్రికి వచ్చిన రోగులతో, సానిటరీ, సెక్యూరిటీ సిబ్బందితో, ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు.

ఆస్పత్రి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సెక్యూరిటీ సైతం అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులతో సౌమ్యంగా మాట్లాడడమే కాకుండా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, ఎవరైనా డబ్బులను అడిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

డాక్టర్లు, సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలోనే ఉండాలని, లేనట్లయితే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో అవసరమైన డాక్టర్లు, సిబ్బంది. మందులు, సౌకర్యాలు. అన్ని ఉన్నాయని, ఎలాంటి సమస్య లేదని, ఉన్న వనరులతో బాగా పని చేయాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బంది పని చేసిన తర్వాత తప్పనిసరిగా ధ్రువపత్రం సమర్పించాలని, అదేవిధంగా రోగులకు ఇచ్చే భోజనం నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ల సంఖ్యను 78 నుండి పెంచాలని ఆదేశించారు. ఓపి రిజిస్టర్ పరిశీలించి ఎలాంటి జబ్బులు ఉన్నవారు ఆసుపత్రికి వస్తున్నారని? ఏ ప్రాంతం నుండి జ్వరానికి సంబంధించిన కేసులు వస్తున్నాయని? అడిగి తెలుసుకున్నారు.

ల్యాబ్ పరీక్ష ఫలితాలు ఎలా వస్తున్నాయని? ఎట్టి పరిస్థితులలో టెస్టింగ్ ఫలితాలు తప్పు రాకూడదని ల్యాబ్ నిర్వాహకులను ఆదేశించారు. అలాగే వారితో ముఖాముఖి మాట్లాడారు. సానిటరీ వర్కర్లతో మాట్లాడుతూ రోజుకు మూడుసార్లు వార్డులను శుభ్రంగా తుడవాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా సరిగా పనిచేయనట్లైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 18004251442 కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరిపైనైనా ఫిర్యాదులు వచ్చినట్లైతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఆయన అన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలే ముఖ్యం, వారికి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చి ప్రసవించిన బాలింత తో మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టిందని ఎవరు బాధపడవద్దని, ఆడపిల్లలు ఏ రంగంలోనూ తీసిపోరని, సంతోషంగా ఉండాలని అన్నారు. ప్రమాదంలో కాలు విరిగి రాడ్డు వేసిన త్రిపురారం మండలం కంప సాగర్ కు చెందిన లిఖిత్ రాడ్ తీసేందుకు ఆధార్ కార్డు లేదని తెలుపగా, తక్షణమే రేషన్ కార్డులో అతని పేరు నమోదు చేసి పంపించాలని పక్కనే ఉన్న ఆర్డీవో శ్రీనివాసరావును ఆదేశించారు.

డ్యూటీ డాక్టర్లు ఆస్పత్రిలో చేరిన ప్రతి రోగితో మాట్లాడి వారి చికిత్స వివరాలను అడిగి కనుక్కోవాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ తో కలిసి ఆసుపత్రి తనిఖీ చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ డయాలసిస్ విభాగాన్ని మొదటి ఫ్లోర్ నుండి కిందికి మార్చాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు నిర్మాణంలో ఉన్న నూతన ఆసుపత్రి భవన పనులను తనిఖీ చేశారు.

అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ ,డాక్టర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

ఆస్పత్రిలో సానిటరీ వర్కర్లు, సెక్యూరిటీ, స్టాఫ్ నర్స్, డాక్టర్లు ఎంతమంది పనిచేస్తున్నారని? భోజనం ఎలా పెడుతున్నారని? అడగడమే కాకుండా అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని సెక్యూరిటీకి తప్ప ఇతర పనులకు వాడవద్దని ఆదేశించారు.

ప్రతి షిఫ్ట్ లో సానిటరీ వర్కర్లు పనిచేసిన తర్వాత తప్పనిసరిగా డాక్టర్ సంతకం తీసుకోవాలన్నారు. మిర్యాలగూడ ఆస్పత్రికి వచ్చిన రోగులను ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ ఆస్పత్రులు ఇతర ఆసుపత్రులకు పంపించవద్దని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఆదాయం పెంచుకునేలా సర్జరీలు వంటివి పెంచాలని అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా డెంగ్యూ, చికెన్ గునియా వంటి వాటిపై అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేసిందని, గ్రామస్థాయిలో ఆశ కార్యకర్త మొదలుకొని జిల్లా స్థాయిలో జిజిహెచ్ వరకు అన్ని ఆసుపత్రులలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త ,చర్యలతో పాటు, ఎవరైనా వ్యాధుల బారిన పడితే తక్షణ వైద్య చికిత్సలు అందిస్తూ న్నామనిస్తున్నామని తెలిపారు.

మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో గత వారంతో పోలిస్తే ఈ వారం జ్వరం కేసులు తగ్గాయని, గతవారం జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వే నిర్వహిస్తే 2200 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు రిపోర్టులు వచ్చాయని, ఈ వారంలో వారందరికీ. మందులు, పరీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. మిర్యాలగూడ ఆస్పత్రిలో జ్వర కేసులు తగ్గుముఖం పట్టాయి అన్నారు.

ప్రజలు జ్వర కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దోమలబారి నుండి కాపాడుకునేందుకు దోమతెరలు, ఇతర సాధనాలను వినియోగించుకోవాలన్నారు. ఆసుపత్రిలో మందులతో పాటు చికిత్సకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన పునరుద్ధరించారు. ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ విభాగాలను పట్టిష్టం చేయాలని కోరారు .

శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో క్రమంగా తగ్గుతున్నాయని, ప్రతి ఒక్కరు పైసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏరియా ఆసుపత్రిలో మందులు సిబ్బంది అన్ని అవసరమైన అంత మేరకున్నాయని, డెలివరీ కేసులు, డయాలసిస్ రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని పరిశుద్ధ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని, డయాలసిస్ రోగుల విభాగాన్ని మార్చడంతో పాటు, ఆంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ఆ, సుపత్రి డాక్టర్లు, తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

Srisailam : శ్రీశైలం కు మళ్లీ భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత..!

BREAKING : మిర్యాలగూడలో సంగం డైరీ వద్ద రైతుల ఆందోళన.. ఉద్రిక్తత..! 

మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

మరిన్ని వార్తలు