Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు పోలిశెట్టి రాంబాబు మృతి..!

Miryalaguda : ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు పోలిశెట్టి రాంబాబు మృతి..!

మిర్యాలగూడ టౌన్, మార్చి 8, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు సినీ నిర్మాత వ్యాపారవేత్త, పోలిశెట్టి రాంబాబు(58) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గత కొన్ని రోజులు నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలిశెట్టి రాంబాబు సిపిఎం అనుబంధ సంస్థ అయిన ప్రజానాట్యమండలిలో పనిచేశారు. అనేక ప్రదర్శనలో ఆటలు, పాటలు పాడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. సినీ నిర్మాతగా గోడ మీద పిల్లి సినిమాకు నిర్మాతగా పనిచేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రాణించారు అనేక వెంచర్లు వేసి వ్యాపారం చేశారు. మృతదేహాన్ని శుక్రవారం రాత్రి మిర్యాలగూడ తరలించారు. శనివారం రాంబాబు అంతక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు పరశురాములు, నాయకులు గుంటోజు వీరాచారి, డబ్బికార్ వీరోజి, తదితరులు సంతాపం ప్రకటించారు.

ALSO READ : Congress First List : కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..!

మరిన్ని వార్తలు