Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. ఎమ్మెల్యే బి ఎల్ ఆర్..!

Miryalaguda : పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. ఎమ్మెల్యే బి ఎల్ ఆర్..!

మిర్యాలగూడ, మనసాక్షి :

పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని కోడెబండ తండా లో భూక్య బిక్షం, రోజా నూతన ఇందిరమ్మ ఇళ్లును శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర సంవత్సరాలలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చామని అన్నారు.

అతి త్వరలోనే మిర్యాలగూడ పట్టణంలో కూడా 2500 ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి కమిషన్ ల కోసం రాష్టాన్ని అప్పుల కుప్పగా చేసిందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి అనేక సంక్షేమాలను పేద ప్రజలకు అందించి వారి ఆశీర్వాదాలు అందుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేక సైదులు, కాంగ్రెస్ నాయకులు గుండు నరేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు