Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!

మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!

మిర్యాలగూడ , మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి – నార్కట్ పల్లి రహదారి హనుమాన్ పేట ఫ్లైఓవర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. బస్సు టైరు పగలడంతో బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం.

ALSO READ : 

1. మిర్యాలగూడ : కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయాలి.. బత్తుల లక్ష్మారెడ్డి

2. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!

3.

26 మంది ప్రయాణికులు హైదరాబాదు నుండి నెల్లూరు కావేరి ట్రావెల్స్ బస్సులో వెళ్తున్నారు. మిర్యాలగూడకు రాగానే మంటలు వ్యాపించడం చూసిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను అందరిని దించి వేరే ట్రావెల్స్ లో పంపించారు.

మంటలు చెలరేగిన విషయాన్ని స్థానిక అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వారు వచ్చే వరకే బస్సు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ ఆప్రమత్తత వల్ల ఎలాంటి ప్రాణహాని చోటు చేసుకోలేదు.

మరిన్ని వార్తలు