Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : తడి, పొడి చెత్తను వేరు చేయాలి..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని డంపింగ్ యార్డ్‌ను గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధ బాలకృష్ణ సందర్శించారు.

Miryalaguda : తడి, పొడి చెత్తను వేరు చేయాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని డంపింగ్ యార్డ్‌ను గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధ బాలకృష్ణ సందర్శించారు. మున్సిపల్ అధికారులు వార్డు కౌన్సిలర్లతో కలిసి డంపింగ్ యార్డ్ నిర్వహణను పరిశీలిస్తూ, తడి చెత్త, పొడి చెత్త ఇతర వ్యర్థాల వేరు చేసే విధానాన్ని తనిఖీ చేశారు. పరిశుభ్రత పరిరక్షణలో భాగంగా వ్యర్థాల సరైన నిర్వహణపై అధికారులకు సూచనలు అందిస్తూ, మున్సిపాలిటీ పరిధిలో శుభ్రత మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు.









