Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ తొలి ఎంపీపీ, తొలి సర్పంచ్.. కన్నెగంటి రంగయ్య మృతి.. నేడు అంతక్రియలు..!

Miryalaguda : మిర్యాలగూడ తొలి ఎంపీపీ, తొలి సర్పంచ్.. కన్నెగంటి రంగయ్య మృతి.. నేడు అంతక్రియలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కన్నెకంటి రంగయ్య (108) అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాదులోనీ ఉప్పల్ లో ఉండే తన కుమారుడి ఇంట్లో మృతి చెందారు. రంగయ్య కు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గారి పల్లి గ్రామానికి చెందిన కన్నెకంటి రంగయ్య సర్పంచ్ వ్యవస్థ ఏర్పడగానే మొదటిసారి యాద్గారిపల్లి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. మండల వ్యవస్థ ఏర్పడగానే మొదటిసారిగానే మిర్యాలగూడ మండల పరిషత్ ఎంపీపీగా పనిచేశారు.

సింగిల్ విండో వైస్ చైర్మన్ పని చేశారు. నాటి వీర తెలంగాణ రైతాగ సాయుధ పోరాటంలో దళ కమాండర్ గా పనిచేసి ఎన్నో పోరాటాలు సాగించారు. ఆరు సంవత్సరాల పాటు మహారాష్ట్ర ఔరంగాబాద్ జైల్లో గడిపారు. ముసీరాబాద్ జైల్లో 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారు. 4 ఏళ్లు అజ్ఞాతంలో ఉండి నాటి సాయుధ పోరాటాన్ని నడిపించారు.

నిజాం నవాబులకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేశారు. యాదగిరి పల్లి కాలువపల్లి ఉట్లపల్లి తక్కెలపాడు, తడక మల్ల గ్రామాలలో పార్టీ నిర్మాణం కసం విశిష్ట కృషి చేశారు. చివరి శ్వాస వరకు ఎర్రజెండా నీడలో పనిచేశారు. చివరి వరకు పార్టీ నిర్మాణం, బలోపేతం కోసం సూచనలు సలహాలు ఇచ్చారు. మిర్యాలగూడ మండలంలో కర్నేకంటి రంగయ్య సుపరచితుడు.

నేడు యాదగిరి పల్లి లో అంత్యక్రియలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కన్నెకంటి రంగయ్య అంత్యక్రియలు నేడు శనివారం మిర్యాలగూడ మండలంలోని యాదిగిరి పల్లి గ్రామంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి హైదరాబాదు నుండి మృతదేహాన్ని యాద్గర్ పల్లికి తీసుకొచ్చారు.

ఆయన మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్ సిపిఎం పట్టణం వన్ టౌన్ టూ టౌన్ కార్యదర్శులు డాక్టర్ మల్లు గౌతమ్ రడ్డి భావాండ్ల పాండు,

జిల్లా కమిటీ సభ్యులు పాదూరు శశిధర్ రెడ్డి, రేమిడాల పరుశురాములు, సీతారాములు, వినోద్ నాయక్, వరలక్ష్మి, రొండి శ్రీనివాస్ గ్రామ సిపిఎం నాయకులు కన్నెకంటి రామకృష్ణ, వస్కుల సూర్యం, సీతారాములు తదితరులు సంతాపం ప్రకటించారు.

MOST READ : 

  1. Karimnagar : మానేరు జలాశయం వద్ద శ్రీకాంత్, లయ సినిమా షూటింగ్..!

  2. Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)

  3. Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!

  4. Drinking water : నేటి నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత.. ఎన్ని రోజులో తెలుసా..!

మరిన్ని వార్తలు